NTV Telugu Site icon

HYD : హైదరాబాద్‌లో బాలీవుడ్‌ నటిపై అత్యాచారయత్నం

Hyderabad

Hyderabad

హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. బాలీవుడ్‌ నటిపై హైదరాబాద్ కు చెందిన కొందరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. కానీ నటి ప్రతిఘటించడంతో పారిపోయారు. వివరాలలో కెళితే బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ నటిని హైదరాబాద్ లో షాప్ ఓపెనింగ్ కు గెస్ట్ గా అహ్వాహించారు. అందుకు తగిన రెమ్యునరేషన్ కూడా ఇస్తామనడంతో నటి అందుకు అంగీకరించి నగరానికి వచ్చింది. ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన సదరు నటి మాసబ్‌ట్యాంక్‌ శ్యామ్‌నగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బస చేసింది.

Also Read : Exclusive : స్పిరిట్ లో ప్రభాస్ తో పాటు తమిళ స్టార్ హీరో

అపార్ట్‌మెంట్‌ లో రాత్రి నిద్రిస్తున్న వేళలో ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు యువకులు నటి ఉన్న గదిలోకి వచ్చారు. తమతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో మాతో వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ బెదిరించారు యువకులు. బెదిరిపోయిన నటి అరిచి గోల పెట్టడంతో ఆమె నోట్లో గుడ్డలు అదిమి పెట్టి ఆమెను కాళ్ళు, చేతులు కట్టేసి బంధించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. కానీ వీలుపడకపోవడంతో ఆమె బ్యాగ్ లోని రూ.50 వేలు డబ్బులు, కొంత నగలు తీసుకుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత  కట్లు విడిపించుకుని అపార్ట్ మెంట్ నుండి బయటపడిన నటి డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు మాసబ్‌ట్యాంక్‌ పోలీసులకు పిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.