Site icon NTV Telugu

NTR 30: సముద్ర వీరుడి విలన్ వచ్చేసాడు…

Ntr 30

Ntr 30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ‘ఎన్టీఆర్ 30’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. హ్యూజ్ యాక్షన్ బ్లాక్ ని ఫస్ట్ షెడ్యూల్ లో స్టార్ట్ చేసిన కొరటాల శివ, సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ ఎఫెక్ట్ లో ‘ఎన్టీఆర్ 30’ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు నుంచే స్టార్ట్ అవ్వనున్న సెకండ్ షెడ్యూల్ లో బాలీవుడ్ యాక్టర్ ‘సైఫ్ అలీ ఖాన్’ జాయిన్ అయ్యాడు. ఎన్టీఆర్ కి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ వార్తని నిజం చేస్తూ మేకర్స్… సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Team #NTR30 welcomes #SaifAliKhan on board ‍, The National Award winning actor joined the shoot of the high voltage action drama” అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్ టు బాలీవుడ్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా మారింది. పాన్ ఇండియా రీచ్ కోసం ఇప్పటికే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకున్న కొరటాల శివ, సైఫ్ ని కూడా కాస్ట్-ఇన్ చెయ్యడం ‘ఎన్టీఆర్ 30’ మార్కెట్ ని పెంచే విషయమే. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో కూడా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ తో ఎన్టీఆర్ పోటీ పడితే ఆన్ స్క్రీన్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ లు కనిపించడం గ్యారెంటీ. మరి సముద్ర వీరుడిగా ఎన్టీఆర్ కనిపించనున్న ఎన్టీఆర్ కి అపోజిట్ లో సైఫ్ అలీ ఖాన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడో చూడాలి.

Exit mobile version