Site icon NTV Telugu

మెగాస్టార్ బర్త్ డే కు సమ్ థింగ్ స్పెషల్ ప్లాన్ చేస్తున్న బాబీ!

ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే! ఈ యేడాది పుట్టిన రోజుకు చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నట్టు! అయితే ఇందులో ‘ఆచార్య’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూ ఉంటే, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ షూటింగ్ జరుపుకుంటూ ఉంది. సో… సహజంగానే ‘ఆచార్య’, ‘లూసిఫర్’ రీమేక్ కు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ వస్తుంది. ‘ఆచార్య’ నుండి సాంగ్ లేదా ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉండగా, ‘లూసిఫర్’ రీమేక్ టైటిల్ అనౌన్స్ మెంట్ లేదా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

Read Also: హై టెక్ డైరెక్టర్… శంకర్

ఈ రెండు కాకుండా చిరంజీవి చేస్తున్న మూడో సినిమా ‘చిరు 154’కు సంబంధించిన అప్ డేట్ నూ దర్శకుడు బాబీ ఇవ్వబోతున్నాడట. అందుకోసమే చిరంజీవితో బాబీ ఓ ఫోటో షూట్ జరుపుతున్నాడట. అన్ని అనుకున్నట్టు జరిగితే చిరంజీవి బర్త్ డే రోజున బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవుతుంది. ఇక తమిళ ‘వేదాళం’ను చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే! దానికి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ కూడా ఈ నెల 20న వస్తుందని తెలుస్తోంది. మొత్తం మీద చిరంజీవి చాలా కాలం తర్వాత తన బర్త్ డే ను కాస్తంత ఘనంగానే జరుపుకోబోతున్నారు.

Exit mobile version