NTV Telugu Site icon

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ సినిమాపై బాబీ డియోల్ వైరల్ కామెంట్స్

Untitled Design (5)

Untitled Design (5)

బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ గురించి పరిచయం అక్కర్లేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాల్లో నటించిన బాబీ డియోల్ ఒక మాటకూడా మాట్లడకుండా తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. అక్కడి నుండి టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస భారీ సినిమాలో అవకాశాలు అందుకుంటున్నాడు. రీసెంట్ గా బాలయ్య ‘డాకు మహారాజ్’ లో విలన్ గా చేసి తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా లో కూడా నటిస్తున్న  బాబీ ఈ మూవీ గురించి వైరల్ కామెంట్ చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వరుస చిత్రలో ‘హరిహర వీరమల్లు’ కూడా ఒకటి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న, ఈ భారీ పాన్ ఇండియా చిత్రం షూటింగ్, దాదాపు పూర్తి కవోస్తుంది. అయితే ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోని ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు. బాబీ మాట్లాడుతూ..‘ ‘హరిహర వీరమల్లు’ స్క్రిప్ట్ చాలా యూనిక్ స్క్రిప్ట్. చాలా అరుదుగా అలాంటి కథలు వస్తాయి. గతంలో జరిగిన కథలు మంచి ఎమోషనల్‌గా, మాస్‌గా కూడా ఉంటాయని మొదటిసారి కథ విన్నప్పుడే అర్ధం అయింది. నాకు ఎంతో నచ్చింది ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది’ బాబీ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.