Site icon NTV Telugu

Bobby deol: విలన్ చెప్పేశాడు… పవన్ సినిమా లేనట్టే!

Hari Hara Veeramallu

Hari Hara Veeramallu

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితేంటి? అనేది ఎటు తేలకుండా ఉంది. ప్రజెంట్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి ఈ సినిమాలు కానీ హరిహర వీరమల్లు మాత్రం అదిగో, ఇదిగో అనడమే తప్ప… అసలు ముందుకు కదలడం లేదు. హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతోంది. పవన్ రాజకీయంగా బిజీగా ఉండడంతో వెనక్కి వెళ్తునే ఉంది. దీని తర్వాత మొదలైన సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి, రిలీజ్‌ కూడా అవుతున్నాయి కానీ హరిహర వీరమల్లు అప్టేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయంలో ఎవ్వరు క్లారిటీ ఇవ్వడం లేదు.

Read Also: Mirna Menon: రెడ్ డ్రెస్సుతో రెచ్చకొడుతున్న మిర్నా మీనన్..

ఆ మధ్య హరిహర వీరమల్లు ఆగిపోయిందనే టాక్ కూడా నడిచింది. ఇక ఇప్పుడు ఇది నిజమేనని మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ బాబీడియోల్ నటిస్తున్నాడు. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న యానిమల్ సినిమాలోను విలన్‌గా నటించాడు బాబీ డియోల్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌ ఈవెంట్‌కు వచ్చిన బాబీ డియోల్.. హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఓ తెలుగు సినిమా ఒప్పుకున్నాను కానీ స‌గం షూటింగ్‌ పూర్త‌యిన త‌ర్వాత ఆగిపోయింద‌ని తెలిపాడు. దీంతో విలన్ చెప్పేశాడు కాబట్టి… హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు దాదాపుగా ఆగిపోయినట్టేనని అంటున్నారు. మరి ఇప్పటికైనా డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు పై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

Read Also: Thalaivar 171: రజినీకాంత్ కోసం కోలీవుడ్ న్యాచురల్ స్టార్ ని దించిన లోకేష్ కనగరాజ్

Exit mobile version