సినిమా హీరోలు ప్రేక్షకులను అలరించడానికి తెరపై అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేస్తుంటారు. వాటిలో చాలావరకు రిస్క్‌తో కూడిన స్టంట్స్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో పలువురు నటులు గాయపడటం కామన్. కానీ గాయాలను పట్టించుకోకుండా మళ్లీ కెమెరా ముందు నిలబడటమే హీరోలు ప్రత్యేకం. తాజాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక పెద్ద ప్రమాదం గురించి గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : BB9 : నాలుగో వారం టెనెంట్ నుండి షాకింగ్ ఎలిమినేట్..
“నా తొలి చిత్రం బర్సాత్ షూటింగ్ సమయంలో నా జీవితాన్ని మార్చేసిన ప్రమాదం జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్‌లో ఒక గుర్రపు స్వారీ సన్నివేశం షూట్ చేస్తుండగా, గుర్రం అదుపు తప్పి పడ్డాను. బలంగా పడిపోవడంతో నా కాలు విరిగిపోయింది. అప్పుడు నా కెరీర్ మొదలవక ముందే ముగిసి పోయింది అనుకున్న, కానీ నా అదృష్టం కొద్దీ సన్నీ నాతోనే ఉన్నారు. గాయం తర్వాత నన్ను తన భుజాలపై మోసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొదట్లో వైద్యులు నా కాలు మున్ముందు సరిగా వాడ లేవని అన్నారు. కానీ సన్నీ వెంటనే నన్ను లండన్‌లోని ఒక పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించారు. చివరికి నడవగలిగిన. అతడే నాకు కొత్త జీవితం ఇచ్చాడు” అంటూ బాబీ భావోద్వేగంతో అన్న పైన తన ప్రేమను వ్యక్తం చేశారు.
