Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bloody Romeo: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ (OG) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo). నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల (జూలై) నుంచి స్టార్ట్ కానుందట. ఈ లోపే సినిమాను విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా చూపించేందుకు డైరెక్టర్ సుజీత్ అండ్ టీమ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం సుజీత్ తన టెక్నికల్ టీమ్‌తో కలిసి లండన్‌లో లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారట.
ఈ మూవీకి సంబంధించిన మెజారిటీ భాగం విదేశాల్లోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. లండన్, బుడాపెస్ట్, హంగేరీ వంటి అందమైన, కాస్ట్లీ లొకేషన్లలో సినిమాలోని కీలకమైన యాక్షన్, డ్రామా సీన్లను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమా మొత్తం షూటింగ్లో దాదాపు 80 శాతానికి పైగా యూరప్‌లోనే జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్‌లో కేవలం ఒక 20 శాతం మాత్రమే టాకీ పార్ట్ షూట్ చేస్తారని టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన యానిమేటెడ్ గ్లింప్స్‌లో నాని ‘చెఫ్ కమ్ గ్యాంగ్‌స్టర్’గా కనిపించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. సుజీత్ మార్క్ స్టైలిష్ టేకింగ్‌కు తోడు, నాని విలక్షణ నటనతో ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆగస్టులో రిలీజ్ కానున్న ‘ది పారడైజ్’ తర్వాత నాని పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌పైనే ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!