NTV Telugu Site icon

Salman Khan Firing Case: సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్.. అక్కడి నుంచే అంతా?

Salman Khan Out Of Home

Salman Khan Out Of Home

Bishnoi Gang Receive Help From Anti National Element Outside India In Salman Khan Firing Case: బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట జరిగిన కాల్పుల ఘటన అందరినీ కలచివేసింది. ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు భద్రత కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన చిన్న లింక్‌ను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో నిందితులపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) విధించారు. అరెస్టయిన ముగ్గురు నిందితుల కస్టడీని మరోసారి మే 8 వరకు పొడిగించారు. అదే సమయంలో ఇప్పుడు ఈ విషయంలో మరో పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరి మీద ముంబై పోలీసులు MCOCA విధించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారతదేశం బయట ఉన్న దేశ వ్యతిరేక శక్తుల నుండి డబ్బు లేదా ఆయుధాల రూపంలో సహాయం లభించిందా అని ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఇప్పుడు అధికారులు తెలిపారు.

KCR : రైతు బంధు రాలేదు రుణ మాఫీ రాలేదు

సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనపై విచారణ జరుపుతున్న నగర పోలీసు క్రైమ్ బ్రాంచ్ నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32)లను సోమవారం అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్న లారెన్స్, అమెరికా లేదా కెనడాలో ఉన్నట్లు భావిస్తున్న అతని తమ్ముడు అన్మోల్‌ను ఈ కేసులో నిందితులుగా భావిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్ అంతర్జాతీయంగా చురుకుగా ఉన్నందున, అతనికి భారతదేశం వెలుపల ఉన్న దేశ వ్యతిరేక శక్తుల నుండి ఆయుధాలు లేదా డబ్బు సరఫరా వంటి ఏదైనా సహాయం లభించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు బిష్ణోయ్ ముఠా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భీభత్సం సృష్టించాలని భావించిందని, నగరంలోని వ్యాపారవేత్తలు, సినీ నటులు, బిల్డర్ల నుంచి డబ్బు వసూలు చేసేందుకు ముఠా సభ్యులు ప్రయత్నించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.