NTV Telugu Site icon

800 Trailer: గుండెల్ని మెలిపెట్టి వదిలేశారు.. గూజ్ బంప్స్ అంతే!

800 Movie Trailer

800 Movie Trailer

800 The Movie Telugu Official Trailer: టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’ రిలీజ్ కి రెడీ అయింది. ‘800’ మూవీని ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోండగా మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మది మలర్ పాత్రలో మహిమ నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా సెప్టెంబర్ 5న ముంబైలో ‘800’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. నిజానికి సచిన్ ఇండియా తరఫున, అటు మురళీధరన్ శ్రీలంక తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు అయితే మైదానంలో పోటీ పడినప్పటికీ మైదానం వెలుపల ఇద్దరు మధ్య మంచి స్నేహం ఉంది.

Ustaad Bhagat Singh: పాపం ఉస్తాద్.. షూట్ మొదలెడదాం అనుకునేలోపే వరుణుడు ఆపేశాడు?

ఈ క్రమంలోనే సచిన్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ అయితే ఆద్యంతం ఎమోషన్స్ తో నింపే ప్రయత్నం చేశారు. నాజర్ నేరేషన్ లో మొదలైన ఈ ట్రైలర్ లో మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ కొన్ని చోట్ల సూట్ అవ్వనట్టు అనిపించినా మొత్తం మీద ఎమోషనల్ కంటెంట్ అయితే వర్కవుట్ అయ్యేలానే కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళుడు అయిన ముత్తయ్య శ్రీలంక జట్టులోకి ఎలా వెళ్ళాడు? అలా వెళ్లేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? లాంటి విషయాలను ట్రైలర్ కట్ లో చూపించారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నిజానికి ‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకుని తమిళంలో రూపొందించిన ఈ సినిమాని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక వీరు కాకుండా నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితాశ్వ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Show comments