NTV Telugu Site icon

Bindu Madhavi: ఇంత చూపించినా.. తెలుగమ్మాయికి అవకాశాలు రావట్లేదు ఎందుకో.. ?

Bindu

Bindu

Bindu Madhavi: టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఆ తెలుగమ్మాయిల్లో సుపరిచితురాలైన హీరోయిన్స్ లో బిందుమాధవి ఒకరు. ఆవకాయ్ బిర్యాని సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన బిందుమాధవి. బంపర్ ఆఫర్ చిత్రంతో మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడు పలు సినిమాలు చేసినా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో బిందుమాధవి తమిళ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ మంచి మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక గత ఏడాది బిగ్ బాస్ ఓటిటి లో పాల్గొని అమ్మడు టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఈ సీజన్ అంతగా ఆసక్తి కలిగించకపోయినా బిందుమాధవి గేమ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక అమ్మడి రేంజ్ మారిపోతుంది అని అనుకున్నారు అందరూ.. కానీ సినిమాల కంటే వెబ్ సిరీస్ లే అమ్మడిని ఎక్కువ పలకరించాయి.

Samantha: స్టార్ హీరో సినిమాలో సామ్ కు ఛాన్స్ .. ఒప్పుకుంటుందా.. ?

ఇక ఈ ఏడాది ఓటీటీలలో రిలీజ్ అయిన యాంగర్ టేల్స్, న్యూసెన్స్ లాంటి వెబ్ సిరీస్లలో బిందుమాధవి కనిపించి మెప్పించింది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులు అమ్మడి చేతిలో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోపక్క సోషల్ మీడియాలో ఆమె యమా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో బిందుమాధవి అదిరిపోయింది. అమ్మడు రెడ్ లెహంగాలో యెర్ర గులాబీలా మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంత అందాలు ఆరబోస్తున్న అమ్మడికి అవకాశాలు ఎందుకు రావట్లేదో తెలియట్లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఈ భామ ఎలాంటి సిరీస్ లలో నటిస్తుందో చూడాలి.