NTV Telugu Site icon

Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు

Bimbisara

Bimbisara

నందమూరి నట వారసుల్లో కళ్యాణ్ రామ్ ఒకడు.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక గత కొన్ని ఏళ్ళుగా కళ్యాణ్ రామ్ సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఈసారి చారిత్రాత్మకమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నూతన దర్శకుడు వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తునం చిత్రం ‘బింబిసార’. 500 వ శతాబ్దంలో మగధ దేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసార జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరక్కించారు. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

బింబిసార గా కళ్యాణ్ రామ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆనాటి కాలంలో రాజు ఎలా ఉండేవాడు అనేది కల్యాణరామ్ ను చూస్తుంటే తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి చిన్నపాటి గ్లింప్స్ ను కూడా వదిలారు. ” ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు” అంటూ కళ్యాణ్ రామ్ బేస్ వాయిస్ తో డైలాగ్ చెప్పడం, మధ్యలో టీజర్ లోని కొన్ని షాట్స్ ను చూపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. జూలై 4 న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. రెండు విభిన్నమైన పాత్రల్లో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. ఆ కళ్లలో రాజు పౌరుషం, పొగరు రెండు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరీన్ థెరిసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. మరి ఆగస్టు 5 న రిలీజ్ కాబోతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం అయినా కళ్యాణ్ రామ్ కు హిట్ ను అందిస్తుందేమో చూడాలి.