బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. తల అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘వీరమ్’కి ఇది హిందీ రీమేక్. వీరమ్ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’గా రీమేక్ చేశాడు. రెండు భాషల్లో మంచి రిజల్ట్ ని రాబట్టిన సినిమాని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రంజాన్ పండగ రోజున ఆడియన్స్ ముందుకి రానున్న ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, వెంకటేష్-భూమికలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని తెచ్చుకుంది.
Read Also: Vyjayanthi Movies: ఈ ప్రపంచం అందంగా ఉంది…
సల్మాన్ ఖాన్ లాంగ్ హెయిర్ లుక్ కి మాత్రం కాస్త నెగటివ్ కామెంట్స్ వచ్చాయి కానీ మిగిలిన విషయాల్లో ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. లేటెస్ట్ ఈ మూవీ నుంచి ‘బిల్లి బిల్లి’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. సుఖ్బీర్ కంపోజ్ చేస్తూ పాడిన ఈ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. ఇన్స్టాంట్ హిట్ అనిపించేలా ఉన్న ‘బిల్లి బిల్లి’ సాంగ్ లో వెంకటేష్, భూమికలు కూడా కనిపించడం విశేషం. పూజా హెగ్డే గ్లామర్, సల్మాన్ ఖాన్ డాన్స్ లో ఉండే స్వాగ్, వెంకీ మామ స్టైల్ అన్నీ కలిపి ‘బిల్లి బిల్లి’ సాంగ్ కి ఆడియన్స్ ని అట్రాక్ట్ అయ్యేలా చేశాయి. ఒక మంచి పెప్పీ నంబర్ సాంగ్ ని వినీ మీరు కూడా ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే ‘బిల్లి బిల్లి’ సాంగ్ పై ఒక లుక్కెయ్యండి.
Hope this song makes u smile, dance n gives out positive energy.. #BilliBillihttps://t.co/OwAzLN21yi@hegdepooja @VenkyMama @farhad_samji @Sukhbir_Singer @AlwaysJani @kumaarofficial @imvickysandhu @IamJagguBhai @bhumikachawlat @boxervijender #AbhimanyuSingh
— Salman Khan (@BeingSalmanKhan) March 2, 2023
