BiggBoss 6 :బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో రోజురోజుకు ఉత్కంఠ పెంచేలా టాస్కులు ఉన్నా కంటెస్టెంట్స్ మాత్రంస్ సరిగ్గా ఆసక్తి చూపించడంలేదన్నది ప్రేక్షకుల అభిప్రాయం.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, తిట్టుకోవడం తప్ప ఆట మీద శ్రద్ద కానీ, ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం లో వారు విఫలమయ్యారని ప్రతి ప్రేక్షకుడు చెప్పుకొస్తున్నారు.. దీనివలనే ఈ షో రేటింగ్ తగ్గిపోతుందని టాక్. ఇక తాజాగా ఈ కంటెస్టెంట్స్ ప్రేక్షకులకే కాదు బిగ్ బాస్ కు కూడా విరక్తి తెచ్చారు. ఎప్పుడు లేనిది బిగ్ బాస్ కే కోపం తెప్పించారు. ప్రతి ఎపిసోడ్ లోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే టాస్క్ సెలబ్రిటీ కంటెండర్ టాస్క్.. ఈ టాస్క్ లో ఫేమస్ క్యారెక్టర్స్ ను అనునయిస్తూ తమదైన స్టైల్లో వినోదాన్ని పంచాలి.
ఇక ఇందులో బాహుబలిగా రోహిత్, దేవసేన గా మెరీనా.. చిరంజీవి గా రేవంత్, బాలకృష్ణ గా శ్రీహన్.. వెంకటేష్ గా ఆదిరెడ్డి, శ్రీదేవి గా ఇనయా, శ్రీవల్లిగా గీతూ, పుష్పగా ఆర్జే సూర్య, ప్రభాస్ గా రాజశేఖర్, పవన్ కళ్యాణ్ గా బాలాదిత్య కనిపించారు. ఈ ప్రోమో ను బట్టి చూస్తుంటే టాస్క్ లో ఎవ్వరు ప్రేక్షకులనే కాకుండా బిగ్ బాస్ ను సైతం మెప్పించలేకపోయారు. దీంతో వీరందరికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. అందరిని బయటికి పిలిచి.. షో లో ఉండడం ఇంట్రెస్ట్ లేకపోతే బయటికి వెళ్లిపోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక దీంతో కంటెస్టెంట్లు బిగ్ బాస్ ను క్షమించమని కోరారు. ఇందుకు శిక్షగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లేదని చెప్పుకొచ్చాడు. అన్ని సీజన్స్ లో వరస్ట్ కంటెస్టెంట్స్ మీరేనని అన్న బిగ్ బాస్ బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి కెప్టెన్సీ టాస్క్ ను తీసివేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది