Biggboss 7: బిగ్ బాస్.. ఏడవసారి రచ్చ చేయడానికి వచ్చేస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో త్వరలోనే ఏడవ సీజన్లోకి అడుగుపెడుతుంది. ఈసారి కూడా అక్కినేని నాగార్జున అని పోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే బిగ్ బాస్ పోస్టర్ ప్రోమో లోగో రిలీజ్ చేశారు దీంతో ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఒక ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకాక్ పిల్ల అని యూట్యూబర్ ను బిగ్ బాస్ కోసం అడిగారని టాక్ నడుస్తోంది. శ్రావణి అనే ఇండియన్.. బ్యాంకాక్ లో ఉంటూ .. అక్కడి విషయాలను ఇండియా వారికి చెప్తూ మంచి గుఱించీపు తెచ్చుకోంది. దీంతో ఆమె బిగ్ బాస్ కు వస్తుందని వార్తలు వినిపించాయి. కాగా బ్యాంకాక్ పిల్ల ఈ విషయమై స్పందించింది. తనను ఎవరు బిగ్ బాస్ బాస్ కు ఆహ్వానించలేదని, ఒకవేళ ఆహ్వానిస్తే తాను కచ్చితంగా వెళ్తాను అని చెప్పుకొచ్చింది.
Sai Dharam Tej: రాజకీయాలోకి ఎంట్రీ.. పవన్ మామ ఏది చెప్తే అది చేస్తా
ఈమె కాకుండా ఈ సీజన్లో బుల్లితెర మెగాస్టార్ అని అనిపించుకున్న ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆటిట్యూడ్ స్టార్ గా ఒక సమయంలో అతనిపై జరిగిన ట్రోలింగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అతడి పేరు బిగ్ బాస్ లో గట్టిగా వినిపిస్తుంది. గత ఏడాది అతడి పై స్క్రోలింగ్ రావడంతో అతడు కూడా స్టార్ గా మారిపోయాడు.. ఎంతలా మారిపోయాడు అంటే మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే మరో రెండు సినిమాలు ఆఫర్ వచ్చాయని తెలుస్తుంది. బిగ్ బాస్ .. చంద్రహాస్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యాటిట్యూడ్ స్టార్ గా బయట పేరు తెచ్చుకున్న చంద్రహాస్ బిగ్ బాస్ లో ఉంటే రచ్చ రచ్చ అని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక వీరి పేర్లు విన్న అభిమానులు.. రేయ్.. ఎవర్రా మీరంతా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈసారి కంటెస్టెంట్ బాగుంటే కానీ అభిమానులు బిగ్ బాస్ ను ఆదరించరని తెలుస్తుంది. ఎందుకంటే.. సీజన్ 6 లో కంటెస్టెంట్లు సరిగా లేకపోవడంతోనే ప్లాప్ అయిందని వినికిడి. మరి బిగ్ బాస్ ఈసారి ఎలాంటి స్టార్లను హౌస్ లోకి దింపుతాడో చూడాలి.
