BiggBoss 6: బిగ్ బాస్ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ ముద్దు బిడ్డ, గేమ్ చేంజర్ అంటూ చెప్పుకొస్తున్న గలాటా గీతూ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఓవర్ యాక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ లా మారినా గీతూ ఆడిన ప్రతి ఆటలోను నిజాయితీ ఉన్నది అనేవారు కొంతమంది అయితే.. అసలు ఆమె గేమ్ చూడాలన్నా, ఆమె మాట వినాలన్న చెడ్డ చిరాకు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎలాంటి పరిస్థితిని అయినా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న అమ్మాయి అని కొందరు చెప్తుంటే.. ఎమోషన్స్, ఫీలింగ్స్ లేకుండా ఎదుటువారితో మాట్లాడే విధానం నచ్చలేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
ఏదిఏమైనా అందరి మాట అయితే గీతూ మరి ఎక్కువ చేస్తోంది అనే. ఇక మొన్నటికి మొన్న టాస్క్ లో బాలాదిత్యను ఎమోషనల్ గా ఏడిపించడం, నిన్నటికి నిన్న స్నేహితుడు అని కూడా చూడకుండా ఆదిరెడ్డిని ఇరికించడం అనేది ఎంత కాదు అనుకున్నా గీతూ చేసిన తప్పు అనే ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతో ఆమెను ఈసారి ఎలిమినేట్ లో ఉండడంతో ప్రేక్షకులు ఆమెను బయటికి పంపించేస్తున్నారని తెలుస్తోంది. ఒకానొక సమయంలో నాగ్ కు, బిగ్ బాస్ కు కూడా తలనొప్పి తెప్పించిన కంటెస్టెంట్ గీతూ. ఇక స్ట్రాంగ్ బజ్ ప్రకారం రేపు గీతూనే బయటికి వస్తుందని తెలుస్తోంది. మరి బయటికి వచ్చాకా గీతూ ఒక్కొక్కరి గురించి ఏం మాట్లాడుతుందో చూడాలి.