Site icon NTV Telugu

Biggboss 6: బ్రేకింగ్.. బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది

Revanth

Revanth

Biggboss 6: ఎట్టకేలకు బిగ్ బాస్ ఫైనల్ కు చేరుకొంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫినాలే నేడు జరగనుంది. బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న మొదలైంది. 15 వారాలు 105 రోజుల ఈ సీజన్ లో 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. ఇక ఒకరితో ఒకరు గొడవలు, టాస్కులు, ప్రేమలు, ఎమోషన్స్ మొత్తం కలగలిపి రసవత్తరంగా సాగింది. అయితే ఎంత లేదనుకున్న ఈ సీజన్ మాత్రం కొంచెం డల్ గానే సాగింది. హమ్మయ్య సీజన్ ఐపోతుంది అనుకుంటున్నారు కానీ అరెరే సీజన్ ఐపోయిందే అని మాత్రం అనుకోవడం లేదు.

ఇక ఇదంతా వదిలేస్తే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి అనుకున్నట్టుగానే రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా నిలిచినట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా రోహిత్ విన్నర్ అంటూ వార్తలు రావడంతో అందరు షాక్ అయ్యారు. అందుకే ఎక్కువ వారాలు నామినేషన్స్ లో ఉన్నా సరే అతన్ని సేఫ్ చేస్తూ స్ట్రాంగ్ ఓటింగ్ ని చూపించారని కూడా చెప్పుకొచ్చారు. కానీ, చివరికి రేవంత్ నే విన్నర్ గా నిలిచాడు. మొదటి నుంచి టాస్కులు నిజాయితీగా చేసింది రేవంత్ అని నమ్మినవారు అతడికి ఓటేసి గెలిపించారు. ఇక రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. ఇక టాప్ 3 లో కీర్తి నిలవగా తో 4వ స్థానంలో ఆదిరెడ్డి నిలిచాడు.. ఇక టాప్ 5 కంటెస్టెంట్ గా రోహిత్ నిలిచాడు. మొత్తానికి అభిమానులు గెస్ చేసినట్లుగానే రేవంత్ నే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి అందరి మన్ననలు పొందాడు.

Exit mobile version