Site icon NTV Telugu

గోవాలో ఫైట్ చేస్తున్న మహేశ్ బాబు!

Bigg Update from Sarkaru Vaari Paata

మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా బిగ్ అప్ డేట్ అందించారు ‘సర్కారు వారి పాట’ టీమ్! సంక్రాంతికి రాబోతోన్న ‘రాజకుమారుడు’ బ్లాస్టర్ వీడియోతో అదరగొట్టేశాడు. ఫైట్, డైలాగ్స్, అదిరిపోయే హ్యాండ్సమ్ లుక్స్ తో మహేశ్ ఆకట్టుకున్నాడు. కీర్తి సురేశ్ కూడా కనువిందు చేసిన ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ వీడియో బ్లాక్ బస్టర్ అవ్వటంతో రెట్టించిన ఉత్సాహంతో గోవాలో ల్యాండ్ అయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు!

Read Also : కాసేపట్లో గుండె మార్పిడి! అంతలోనే డ్యాన్స్ పార్టీ!

పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న మహేశ్ బాబు కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఓ హై ఓల్టేజ్ ఫైట్ రామ్, లక్ష్మణ్ స్టంట్ కొరియోగ్రఫీలో పిక్చరైజ్ చేస్తున్నారు. 2022 పొంగల్ రేసులోకి ప్రిన్స్ కాలుమోపటంతో వేగం పెంచేశారు దర్శకనిర్మాతలు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపైన దృష్టి పెట్టనున్నారు. ‘సర్కారు వారి పాట’కు పాటల్ని థమన్ సమకూరుస్తున్నాడు…

Exit mobile version