NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: శోభకు షాక్.. కెప్టెన్ అయిన ఆనందం కూడా లేకుండా చేశావ్ గా నాగ్ మామ!

Tasty Teja Sobha

Tasty Teja Sobha

Tasty Teja Eliminated from Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ముందు 14 మంది, వైల్డ్ కార్డు ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లు వచ్చారు. వీళ్లలో నుంచి మొదటి వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా, ఎనిమిదో వారం సందీప్‌లు షో నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. నిజానికి ఈ సీజన్‌లో నామినేషన్లు అన్నీ కంటెస్టెంట్ల మధ్య వాదోపవాదనలతో ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్న క్రమంలో తొమ్మిదో వారం ప్రక్రియ కూడా కంటెసెంట్ల మధ్య గొడవలతోనే సాగిపోయింది. ఇందులో ఎనిమిది మంది కంటెస్టెంట్లు భోలే షావలి, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, అర్జున్‌లు నామినేట్ అయ్యారు.

Satyabhama: కాజల్ ‘సత్యభామ’గా వచ్చేస్తోంది!

ఈ వారానికి గానూ జరిగిన ఓటింగ్‌లో టేస్టీ తేజ మొదటి నుంచీ ఆరో స్థానంలోనే కొనసాగుతున్నా ఊహించని విధంగా ఓటింగ్ ముగిసే సమయానికి అతడు ఏడో స్థానానికి పడిపోయాడని రతికా రోజ్ ఆరో స్థానానికి చేరిందని అంటున్నారు. మొదటి నుంచీ ఈ వారంలో శోభా శెట్టినే చివరి స్థానంలో ఉన్నా టేస్టీ తేజను ఎలిమినేట్ చేసినట్టు బిగ్ బాస్ లీక్స్ బయటకు వచ్చాయి. ఈ మేరకు తాజాగా ఓ న్యూస్ లీకైంది. శోభా ఉంటే టీఆర్పీ వస్తుంది అని భావిస్తున్న బిగ్ బాస్ టీమ్ ఆమెను అప్పుడే పంపించకుండా ఆమెతో స్నేహంగా ఉంటున్న తేజను పంపేందుకు సిద్ధం అయ్యారు. అలా అయినా కెప్టెన్ అయిన సంతోషము లేకుండా శోభతో సన్నిహితంగా ఉండే తేజను పంపేయడం ఆమెకు షాకింగ్ అంశమే. అయితే ఆమెను సేవ్ చేశారు కాబట్టి కొంత కలిసి వచ్చే అంశం కూడా.