బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్ 5”. సెప్టెంబర్ 5న కర్టెన్ రైజర్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. ఈ మొదటి ఎపిసోడ్ లోనే కంటెస్టెంట్ లను పరిచయం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. వారాంతం అంటే శనివారం, ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తారు. ఈ షోను కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే “బిగ్ బాస్”కు సంబంధించిన ప్రోమోకు మంచి స్పందన వచ్చింది.
Read Also : నయన్ చేతిలో బేబీ… సస్పెన్స్ లో అభిమానులు
“బిగ్ బాస్ సీజన్ 5” తెలుగు కంటెస్టెంట్స్ గురించి మాత్రం సస్పెన్స్ గా ఉంచారు. అయితే టెలివిజన్ తారలు యాంకర్ రవి, వర్షిణి, షణ్ముఖ్ జస్వంత్, లోబో, నవ్య స్వామి, యానీ మాస్టర్, ఆట సందీప్, వి.జె. సన్నీ, ఆర్జే కాజల్ పోటీదారులుగా పాల్గొనబోతున్నారని వినికిడి. అయితే ఇప్పటికే క్వారంటైన్ లో ఉంచిన “బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలుపుతూ రాత్రి మరోసారి పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ షో అనుకున్న సమయానికే ప్రసారం కానుంది అనే విషయాన్నీ స్పష్టం చేశారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకి హోస్ట్‌గా నాగార్జున అక్కినేనికి చేయడం ఇది మూడోసారి. గత రెండు సీజన్లకు కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించాడు. రెండవ సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా, మొదటి సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేసి అలరించారు.
మరోవైపు నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారుతో ఇంకా పేరు పెట్టని చిత్రంలో పని చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రీసెంట్ గా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేయబోతున్నారు.
