Site icon NTV Telugu

Bigg Boss 9 : ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యేది ఎవరో తెలుసా..!

Bigg Boss

Bigg Boss

బిగ్ బాస్ తెలుగు  సీజన్‌ 9  కూడా  ఎప్పటిలాగే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్‌ను పంచుతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు కొత్త ముఖాలు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి మొత్తం తొమ్మిది మంది మొదటి వారం నామినేషన్‌లో నిలిచారు. ఇక ఓటింగ్ ప్రారంభమైన వెంటనే కొందరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మ ఎప్పుడూ తక్కువ ఓట్స్‌లో ఉండటం గమనార్హం. అయితే చివరికి తక్కువ ఓటింగ్ కారణంగా..

Also Read : Sai Pallavi : సాయి పల్లవి డిసిషన్‌తో.. ఇబ్బందుల్లో శింబు 49వ సినిమా

శ్రష్టి వర్మ మొదటగా బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఎలిమినేట్ అయ్యారట. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే (సెప్టెంబర్ 13) జరిగింది. ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి ప్రసారం చేయనున్నారు. ఇక శ్రష్టి వర్మ రెమ్యునరేషన్ విషయం పై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. సమాచారం ప్రకారం, ఆమె రోజుకు సుమారు రూ. 28,571 పారితోషికం పొందినట్లు తెలుస్తోంది. అంటే వారం రోజులు హౌస్‌లో ఉండటంతో కలిపి దాదాపు రూ. 2 లక్షలు సంపాదించినట్టే. అయితే, ఈ అమౌంట్ ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే తక్కువగానే భావిస్తున్నారు.

Exit mobile version