NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు.. ఏడిపించేసిన యావర్ బ్రదర్స్

Yawar

Yawar

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి టాస్క్ లోనూ, ప్రతి నామినేషన్ లోను బిగ్ బాస్ వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ స్టార్ అయ్యి పది వారాలు కావొస్తుంది. దీంతో కంటెస్టెంట్స్ ఫ్యామిలీని మిస్ అవుతున్న విషయం తెల్సిందే. దీంతో ఈ వారం ఫ్యామిలీ వీక్ చేసేశారు. కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి వచ్చి వెళ్తున్నారు. ఇక ఎప్పుడు ఎమోషనల్ అవ్వని శివాజీ, అర్జున్ కూడా ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యారు. ఇక ఇప్పటికే శివాజీ, గౌతమ్, భోలే, అశ్విని, అర్జున్ కుటుంబ సభ్యులు రాగా.. నేడు శోభ, అమర్, యావర్ కుటుంబ సభ్యులు రానున్నారు. యావర్ మొదటి నుంచి తన కుటుంబాన్ని మిస్ అవుతున్న విషయం తెల్సిందే.

Druva Nakshatram Trailer: విక్రమ్ స్టైల్.. గౌతమ్ మీనన్ టేకింగ్.. వేరే లెవెల్ అంతే

ఇక నేడు ఇంట్లోకి వచ్చిన గౌతమ్ తల్లిని చూసి యావర్ మరింత ఎమోషనల్ అయ్యాడు. యావర్ తల్లి చిన్నతనంలోనే అతనికి దూరమైంది అని తెలుస్తోంది. దీంతో తల్లి ప్రేమను ఇప్పటివరకు చూడని యావర్ .. హౌస్ లో వారి ప్రేమను చూసి మరింత ఎమోషనల్ అయ్యాడు. ఇక యావర్ అన్న హౌస్ లోకి అడుగుపెట్టగానే.. యావర్ కంటనీరు పెట్టుకున్నాడు. అతనితో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇక శివాజీ దగ్గర యావర్, యావర్ అన్న కూడా అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు అని కంటనీరు పెట్టుకోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకొనేలా చేసింది. తమ్ముడు కప్పు కొట్టాలని, దానికోసం అందరు ఎదురుచూస్తున్నారు అని యావర్ అన్న ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments