NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: శివాజీ అన్నది కరక్టే.. ఆ బ్యాచ్ అంతా ఒకటే.. సందీప్ వేస్ట్

Sandeep

Sandeep

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. హౌస్ లో రోజుకో గొడవ.. అరుపులు, కేకలు.. అన్నింటికి మించి కొంతమంది కంటెస్టెంట్స్ కు అన్యాయం జరుగుతుంది. పవర్ అస్త్ర కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. అయితే సంచాలకుడుగా ఉన్న సందీప్ మాత్రం .. తమ బ్యాచ్ కోసం మాత్రమే ఆడుతున్నాడు.. సొంత గేమ్ ఆడడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే .. మొదటి నుంచి కూడా ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్, సందీప్.. ఒక బ్యాచ్ గా ఉంటున్నారు. వీరందరూ స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్, షోస్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యినవారు. ఇక వచ్చిన దగ్గరనుంచి ఈ నలుగురు ఒక గ్రూప్ గా ఉంటున్నారు. వీరిలో ఎవరికి ప్రాబ్లెమ్ వచ్చినా సందీప్ తోడుగా ఉంటున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే రణధీర, మహాబలి గేమ్ ఆడుతున్న సమయంలో.. ప్రియాంక తప్పు చేసినా సపోర్ట్ చేసి.. వారిని గెలిపించాడు సంచాలకుడు గా ఉన్న సందీప్.

Ghost: గ్యాంగ్ స్టర్ శివన్న వచ్చేసాడు… సాంగ్ KGF రేంజులో ఉందిగా

ఇక అదే పవర్ అస్త్ర కోసం నిన్న జరిగిన కారం చికెన్ గేమ్ లో శోభా శెట్టిని గెలిపించడానికి గౌతమ్ కు అన్యాయం చేశాడు సందీప్. శోభా 27 చికెన్ ముక్కలు తినగా .. గౌతమ్ 28 ముక్కలు తిన్నాడు. కానీ, సందీప్ బయటకు వచ్చి.. ఒక చికెన్ ముక్క పూర్తిగా తినలేదని చెప్పి.. గౌతమ్ ఓడిపోయాడని చెప్పాడు. దీంతో శోభా శెట్టి కంటెండర్ గా నిలిచింది. ఇక దీంతో అభిమానులు సందీప్ పై ఫైర్ అవుతున్నారు. మొదట్లో శివాజీ చెప్పినట్లు ఆ బ్యాచ్ అంతా ఒకటే.. సందీప్ ఒక వేస్ట్ సంచాలకుడు అని చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క యావర్ ను కూడా సందీప్ అలానే ట్రీట్ చేస్తున్నాడు. వారి బ్యాచ్ కు సపోర్ట్ చేస్తూ.. సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Show comments