Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. హౌస్ ను రణరంగంగా మారుస్తున్నారు. ముఖ్యంగా శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పవర్ అస్త్ర కోసం పోటీకి దిగిన ప్రతిసారి వీరు ఒక పెద్ద యుద్ధాన్నే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే సందీప్, శివాజీ పవర్ అస్త్రను సాధించుకొని పర్మినెంట్ హౌస్ మేట్స్ గా మారారు. ఇక తరువాత కంటెండర్ గా మారడానికి.. బిగ్ బాస్.. శోభా, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ ను సెలెక్ట్ చేశారు. ఇక వారు పవర్ అస్త్రకు పనికిరారు అని చెప్పిన కుటుంబ సభ్యులతో ఒక పోటీని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రిన్స్ గంటసేపు తన చిన్ ను ఒక చెక్కకు ఆనించి ఉంచాడు. ఆ సమయంలో ఎవరు ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టినా కూడా అతను భరించి.. పవర్ అస్త్ర గెలవడానికి తాను యోగ్యుడును అని నిరూపించాడు. ఇక శోభాను.. అనర్హురాలు అని చెప్పిన వారికి.. మరో పోటీ నిర్వహించాడు బిగ్ బాస్ . ఇందులో ఎంతో కారంగా ఉండే చికెన్ ను శోభా కన్నా ఎక్కువ తినగలిగితే.. ఆమె ప్లేస్ లో మరొకరిని కంటెండర్ గా నిలబెడతానని చెప్పడంతో శుభ, పల్లవి ప్రశాంత్, గౌతమ్.. ఆ టాస్క్ కోసం పోటీపడ్డారు. ఈ పోటీలో శోభా.. ఆ కారం తినలేక ఏడుస్తూ.. తనవల్ల కాదు అని వెళ్ళిపోయింది.
Meera Antony: నా మరణం మిమ్మల్ని బాధపెడుతోంది అని తెలుసు.. మీరా ఆంటోనీ సూసైడ్ లెటర్ స్వాధీనం..?
ఇక ఇంకోపక్క అమర్ దీప్ ను అనర్హుడు అని చెప్పిన ప్రియాంకకు కూడా బిగ్ బాస్ పోటీ చేయమని చెప్పుకొచ్చాడు. వారిద్దరిలో ఎవరైతే జుట్టును త్యాగం చేస్తారో.. వారే పవర్ అస్త్ర కోసం పోటీపడతారని తెలిపాడు. దీంతో ప్రియాంక, అమర్ ఇద్దరు.. తాము చేయమని చెప్పుకొచ్చారు. అమర్ అయితే గుండు కొట్టించుకోవాలని, ప్రియాంక అయితే భుజంపై వరకు హెయిర్ కట్ చేయాలనీ తెలిపాడు. ఇక అమర్ అయితే.. తనకు రవితేజ ఫేవరేట్ అని .. ఆయన తన జుట్టుపై చెయ్యి వేసి.. నాలానే ఉంది అని మెచ్చుకున్నారనీ.. ఇప్పుడు దీనికోసం నా హెయిర్ ను ఇవ్వలేను అని చెప్పాడు. మరి చివరకు బిగ్ బాస్ మాటను ఎవరు గౌరవిస్తారు.. ? పవర్ అస్త్ర కోసం.. రవితేజ లుక్ ను అమర్ వదులుకుంటాడా.. ? అనేది చూడాలి.