Bigg boss 6: ఇవేమి టాస్కులు బిగ్ బాస్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg boss 6: ఆ వారంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఎత్తిచూపడానికి, వారిని మోటివేట్ చేయడానికి ఒక రోజును కేటాయిస్తున్న నాగార్జున, రెండో రోజు ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపడంతో అయిపోతోంది. పైగా ఈ మూడు వారాల్లో పెట్టిన టాస్క్ లు వ్యూవర్స్ నే కాదు… అక్కడ హౌస్ లో ఆడే వారినీ గందరగోళానికి గురిచేసినట్టు అర్థమైపోతోంది. డాల్స్ తో పెట్టిన పోటీలో వాటి దుస్తులు మార్చేయడం, అడవిలో ఆట టాస్క్ లో రబ్బర్ బ్యాండ్స్ ఒకదానికి తీసి మరొక దానికి పెట్టేయడం, చివరకు హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ లో ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళే విజేతలు అని చెప్పి కంటెస్టెంట్స్ లో కన్ ఫ్యూజన్ కు గురిచేయడం జరిగింది. దాంతో ఎవరికి వారు వాళ్ళకిచ్చిన టాస్క్ ను పక్కన పెట్టి డబ్బులు పోగేసుకునే పనిలో పడిపోయారు. తక్కువ మొత్తం ఉన్నవాళ్ళు తమ స్నేహితులకు వాటిని ధారాళంగా ఇచ్చేశారు. ఇక చలాకీ చంటి అయితే… తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ ను ఏ ఒక్క దశలోనూ ఆడటానికి ప్రయత్నించలేదు. శనివారం నాగార్జున ఇదే ప్రశ్న అడిగితే, రెండో రోజు తను గేమ్ ఆడదామని అనుకున్నానని, కానీ ఈలోగా రూల్స్ మారిపోయాయని చెప్పాడు. ఈ రకమైన కన్ ఫ్యూజన్ ఆ ఆటలో చాలామందికి కలిగింది. మొత్తం మీద క్లారిటీ లేకుండా గేమ్స్ ను పెట్టి, వాటిని వివిధ దశల్లో మరింత క్లిష్టంగా మార్చి బిగ్ బాస్ ఏం సాధించాలని అనుకుంటున్నాడో అర్థం కాదు. పైగా రెండు, మూడు రోజుల పాటు సాగే ఈ గేమ్స్ ను కేవలం ఒక గంట నిడివికి కుదించి చూపడంతోనూ ఎవరి గేమ్ నూ వ్యూవర్స్ జడ్జ్ చేయలేని పరిస్థితి నెలకొంది.
Also Read
ఆరోహి అవుట్!
ఇదిలా ఉంటే… బిగ్ బాస్ హౌస్ లోని ప్రేమాటలకు ఈ వారం ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయ్యింది. ఆరోహి, ఆర్జే సూర్య మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందని భావించిన ఇతర కంటెస్టెంట్స్ కు, వ్యూవర్స్ కూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆర్జే సూర్యకు బయట బుజ్జమ్మ ఉందని, ఆమెతోనే అతని జీవితం అని చెప్పేసింది. అలానే తనకు నందు ఉన్నాడని, అతనితోనే తన ఫ్యూచర్ అని స్పష్టం చేసింది. సో… వీరిద్దరూ ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ, కార్చే కన్నీళ్ళు, ఓదార్పు కౌగిళ్ళు… అన్నీ కంటెంట్ కోసమే అని అర్థమైపోయింది. అలానే శ్రీహన్ బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్ సిరి హన్ముంతకు బోయ్ ఫ్రెండ్. ఇది జగమెరిగిన సత్యం. సో… అతని మనసులోనూ ఇక్కడున్న వారిలో ఎవరికీ చోటు అనేది దక్కదు. ఈ రకమైన క్లారిటీ అందరికీ వచ్చేయంతో కావచ్చు… ఈ లవ్ గేమ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని బిగ్ బాస్ ఈ వీక్ ఆరోహిని బయటకు పంపుతున్నట్టు తెలిసింది. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యే సరికే లీకువీరులు ‘ఆరోహి అవుట్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్స్ వేసేశారు. అయితే… ఆమె అవుట్ కావడానికి రీజన్స్ ఏమిటీ? ఏ స్టేజీలో ఎవరెవరు సేఫ్ అయ్యారు? అనేది తెలియాలంటే మాత్రం ఆది సాయంత్రం ఆరు నుండి ప్రసారమయ్యే బిగ్ బాస్ 6 ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ చూడాల్సిందే!

తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!