Site icon NTV Telugu

“బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ క్వారంటైన్ అప్పటి నుంచే…?

bigg-boss

ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు 5 వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రసారం కానుంది. షో నిర్వాహకులు ఇటీవల కొత్త ప్రోమోను రూపొందించారు. ప్రోమోను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తారు. హీరో నాగార్జున వరుసగా మూడోసారి షో హోస్ట్‌గా చేయబోతున్నారు. ఇదిలా ఉండగా తాజా అప్‌డేట్‌ల ప్రకారం బిగ్ బాస్ పోటీదారులందరూ క్వారంటైన్ కు వెళ్ళబోతున్నారట. దానికి సంబంధించిన స్థలంతో పాటు తేదీ కూడా ఖరారు చేశారట మేకర్స్. ఆగస్టు 22న ఒక స్టార్ హోటల్‌లో కంటెస్టెంట్స్ క్వారంటైన్ కు వెళ్తారంట. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అయిన తర్వాత వారిని బిగ్ బాస్ హౌజ్ కు తరలిస్తారని అంటున్నారు.

Read Also : అరకులో ఫ్యామిలీ తో చిల్ అవుతున్న యాంగ్రీ హీరో

పోటీదారులందరూ హౌస్‌లోకి ప్రవేశించే ముందు రెండు టీకాలు వేయించుకోవాల్సిందేనట. ఇక “బిగ్ బాస్-5″లో పాల్గొనబోయేది వీల్లేనంటూ కొన్ని పేర్లు విన్పిస్తున్నాయి. టీవీ నటీమణులు లహరి, నవ్య స్వామి, ఉమ, యాంకర్లు వర్షిణి, శివ, లోబో, రవి, ప్రియాంక, నటి ప్రియ, కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్, డాన్స్ మాస్టర్స్ రఘు, హీరోయిన్ ఇషా చావ్లా, యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, నిఖిల్, విజె సన్నీ, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, భార్య తో కలిసి “ఆట” సందీప్ ఈ పాపులర్ లో పాల్గొనబోతున్నారు. ఇవి కేవలం రూమర్స్ మాత్రమే. “బిగ్ బాస్” నిర్వాహకులు అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించే దాకా అసలు విషయం లేదా కంటెస్టెంట్స్ గురించి తెలియదు.

Exit mobile version