Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!

Bigg Boss Telugu 10

Bigg Boss Telugu 10 300kb

Bigg Boss Telugu 10: సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేయనుండగా, ఈసారి సీజన్‌ను ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. తొలుత 10 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. దీంతో ఈసారి హౌస్‌లోకి వెళ్లే ఆ 10 మంది ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు 10 కోసం కంటెస్టెంట్లుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న జాబితాలో చైత్ర రాయ్, వర్షిణి సౌందరజన్, ముఖేష్ గౌడ, నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, జబర్దస్త్ ఫేమ్ నరేష్, రామ్‌ప్రసాద్, ‘చెన్నై లవ్ స్టోరీ’ నటుడు అదిత్ అరుణ్, దేబ్జానీ మోదక్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి ఉన్నారు. ఈ పేర్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.

అయితే ఈ 10 మంది పేర్లను మేకర్స్ ఇప్పటివరకు ఆఫీషియల్ గా ప్రకటించలేదు. కాబట్టి వీరంతా కచ్చితంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తారని ఇప్పుడే చెప్పలేం. బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగించడం ఆనవాయితీ. అందువల్ల సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పేర్లలో కొందరు మారే అవకాశం కూడా ఉంది. అసలు ఎవరెవరు హౌస్‌లోకి అడుగుపెడతారనే క్లారిటీ గ్రాండ్ ఓపెనింగ్ రోజునే వచ్చే అవకాశం ఉంది.

ఈసారి బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ కావడంతో నిర్వాహకులు ప్రత్యేకంగా ‘దశావతారం’ కాన్సెప్ట్‌ను తీసుకొస్తుండగా, తొలుత పరిమిత సంఖ్యలో కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించి, సీజన్ కొనసాగుతున్న సమయంలో మిడ్ వీక్, వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా మరికొందరిని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గేమ్‌లో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మరోవైపు ఈ సీజన్‌లో సామాన్యులకు కూడా అవకాశం కల్పించేందుకు నిర్వాహకులు ‘అగ్ని పరీక్ష’ పేరుతో టాలెంట్ హంట్ నిర్వహించారు. దీని ద్వారా కామన్ పీపుల్ ని కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా గేమ్‌లో భాగమైతే కాంపిటీషన్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌లుగా వ్యవహరించగా, మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు 10వ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో ఆయన హోస్టింగ్‌ ను కూడా అభిమానులు క్రేజీగా మరోసారి చూడబోతున్నారు.

బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్ ఓపెనింగ్ సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు నిజమా కాదా అన్నది సస్పెన్స్‌గానే ఉండనుంది.

నాగార్జున హోస్టింగ్, ‘దశావతారం’ కాన్సెప్ట్, సెలబ్రిటీలతో పాటు సామాన్యుల ఎంట్రీ, మిడ్ వీక్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ సీజన్‌పై ఇప్పటికే అంచనాలను పెంచుతున్నాయి. మరి ప్రచారంలో ఉన్న 10 మంది నిజంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారా, చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో సెప్టెంబర్ 6న తేలనుంది.