Site icon NTV Telugu

బిగ్ బాస్ సోహైల్ కొత్త చిత్రం ప్రారంభం..

sohel

sohel

మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమిన ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరో గా కాకతీయ ఇన్నోవేటివ్స్ తో కలసి దొండపాటి సినిమాస్ నిర్మిస్తున్న తొలి సినిమా పూజ కార్యక్రమం యాదాద్రి లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సొహైల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

కొత్త తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. దర్శకులే నిర్మాతలైతే కంటెంట్ విషయంలో కసరత్తు జరుగుతుందనే దానికి నిదర్శనంగా ఈ సినిమా ఉంటుందంటున్నారు. హైదరాబాద్లో జరిగే రెగ్యులర్ షూటింగ్ టైమ్ లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు నిర్మాతలు.

Exit mobile version