Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9కు షాక్ తగిలింది. బిగ్ బాస్ షోను మూసేయాలంటూ గజ్వేల్ కు చెందిన కొందరు వ్యక్తులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ షో వల్ల యూత్ చెడిపోతున్నారని వారు ఫైర్ అయ్యారు. ఈ షో వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. ఇందులో చేసే గొడవలు, మాట్లాడే బూతులు, అశ్లీల ఫోజులు, అశ్లీల మాటల వల్ల యూత్ పెడదోవ పడుతున్నారంటూ వారు అన్నారు. ఈ షోలోకి వివాదాల్లో ఉన్న వారిని తీసుకొచ్చి ఆడిస్తున్నారు. వారి వల్ల సంసారాలు చెడిపోతున్నాయి అంటూ తెలిపారు.
Read Also : Pawan Kalyan : వాళ్లను చూసి పవన్ కల్యాణ్ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్
రీతూ చౌదరి, మాధురి లాంటి వాళ్లను తీసుకొచ్చి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు. ఇలాంటి వారి వల్ల కాపురాలు కూలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కర్నాటకలో బ్యాన్ చేసినట్టు ఇక్కడ కూడా చేయాలి. లేదంటే మహిళా సంఘాలు, ప్రజాసంఘాలతో బిగ్ బాస్ హౌస్ ను ముట్టడిస్తాం. ఇలాంటి షో వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందులో చూపించేవన్నీ మనుషులను పెడదోవ పట్టించేవి అంటూ వాళ్లు మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య బిగ్ బాస్ షో మీద తీవ్రమైన విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ ఫిర్యాదుతో బిగ్ బాస్ మరింత వివాదంలో పడింది.
Read Also : Chiranjeevi : ఆ విషయంలో చిరు గ్రేట్.. మనసున్న మెగాస్టార్..
