Site icon NTV Telugu

Bigg Boss Telugu 7: నువ్వెంత.. నీ బతుకెంత.. బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్

Biggboss

Biggboss

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ రోజురోజుకు ఉత్కంఠను పెంచేస్తుంది. ముఖ్యంగా సోమవారం వచ్చిందంటే.. నామినేషన్స్ తో బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. నామినేషన్ చేసుకుంటున్నారు. ఇక కొత్తవాళ్లు వచ్చాక వారితో పోటీపడుతూ తమ సత్తా చాటుకుంటున్నారు. ఇక నిన్నటినుంచి నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందులో శోభా, ప్రియాంక.. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ భోలే షావలీ మీద విరుచుకుపడ్డారు. ఈ వారం ఎక్కువ మంది భోలే ను నామినేట్ చేశారు. ఇక ప్రియాంక కు, భోలే కు మధ్య పేద గొడవ జరిగింది. మీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తోందిరా? ఆడపిల్లలు.. మీకు మంచి భవిష్యత్తు ఉంది అని భోలే కాస్తా వెటకారంగా అనడంతో దీనికి కోపం తెచ్చుకున్న ప్రియాంక ..ఆడపిల్ల అంటూ నటించినవ్ కదా.. ఇంతసేపు కనిపిస్తోంది అంటూ భోలేమండిపడింది. ఆ తర్వాత నీలాంటోళ్లను చాలామందిని చూసినా అని భోలే అనడంతో కోపంతో ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తరువాత భోలే బూతులు మాట్లాడబోయి వెంటనే ఆపుకొని బిగ్ బాస్ కు సారీ చెప్పాడు.

Mehreen Pirzada: అంత కష్టపడి చేస్తే సె* క్లిప్ అంటారా.. హానీ పాప ఆవేదన

ఇక ఈ మాటకు శోభా రెచ్చిపోయింది. పక్కన ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు అని అరిచింది. ఇక తరువాత.. వెంటనే తూ.. అని ప్రియాంక అనడంతో.. నేను అదే తిరిగి అంటే నీ బతుకు ఏం కావాలా? అనడంతో ఆ హౌస్ మొత్తం హీట్ ఎక్కింది. ఆ తర్వాత శోభాశెట్టి అతన్ని నామినేట్ చేస్తూ కుండ పగలగొడుతుంది. ఇంకోపక్క శోభా.. తన ఫ్రెండ్ తేజను నామినేట్ చేసింది. పనిష్మెంట్ ను సీరియస్ గా తీసుకోవడం లేదని ఆమె రీజన్ చెప్పి తేజ్ కుండ పగులకొట్టింది. శోభా నామినేట్ చేయడంపై తేజ హార్ట్ అయ్యినట్లు కనిపించింది. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Exit mobile version