Site icon NTV Telugu

Syed Sohel: బిగ్ బాస్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం

Sohel

Sohel

Syed Sohel Mother Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ నటుడు, హీరో సోహైల్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన సోహైల్ బిగ్ బాస్ తెలుగు ఫోర్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పటికైనా హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తానని బిగ్ బాస్ లో చెబుతూ వచ్చిన ఆయన హీరోగా పలు సినిమాలు కూడా చేశాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Jani Master: జానీ మాస్టర్ పై ముందు సెక్సువల్ హరాస్మెంట్ కంప్లైంట్ రాలేదు.. కానీ?

ఇక సోహైల్ తల్లి ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు తెలుస్తోంది. సోహైల్ కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయనకు తండ్రి సయ్యద్ సలీం, తల్లి, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. సోహైల్ తల్లి గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. డయాలసిస్ నిమిత్తం మెడికవర్ హాస్పిటల్ లో జాయిన్ అయిన, ఆమె పరిస్థితి విషమించడంతో కన్ను మూసినట్లుగా తెలుస్తోంది. దీంతో సోహైల్ శోకసంద్రంలో మునిగిపోయాడు. సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని స్వస్థలం కరీంనగర్ తరలిస్తున్నారు. విషయం తెలిసిన అభిమానులు ఆయనను ధైర్యంగా ఉండాలంటూ ధైర్యం చెబుతున్నారు.

Exit mobile version