Bigg Boss : బిగ్ బాస్ సీజన్-9 కోసం అగ్నిపరీక్ష అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ముగ్గురు సామాన్యులకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారంట. దాని కోసం వచ్చిన వాళ్లకు నానా రకాల పిచ్చి టాస్కులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చేసే వాళ్లకే కాదు.. చూసే వాళ్లకు కూడా చిరాకు పుట్టేలా ఉన్నాయి ఆ పిచ్చిటాస్కులు. మొన్న దమ్ము శ్రీజను పేడ రాసుకోవాలంటే ముఖానికి రాసుకుంది. నిన్న మాస్క్ మ్యాన్, సాయికృష్ణను పిలిచి అరగుండు గీయించుకోవాలన్నారు. పాపం చేసేది లేక మాస్క్ మ్యాన్ అందరి ముందే ట్రిమ్మర్ తో అరగుండు గీసుకున్నాడు.
Read Also : Agent : మూవీ ప్లాప్.. రూపాయి తీసుకోని హీరో.. ఎవరంటే..?
కంటెస్టెంట్ల ఫోన్లను క్షణం కూడా ఆలోచించకుండా పగలగొట్టాలంటే పగలగొట్టారు. కొందరు కటెంస్టెంట్లకు అయితే షర్టు లేకుండా ఛాతిపై స్టిక్కర్లు అంటించి.. వాటిని బలంగా లాగేస్తుస్తున్నారు. ఇంకొందరికి పచ్చబొట్టు పొడిపించారు. మరికొందరికి స్వీట్ షాక్ పేరుతో ఓ వైపు షాకులు పెడుతూ పెయింటింగ్ వేయాలన్నారు. ఇదంతా చూస్తున్న నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సెలబ్రిటీలకు ఏమో డైరెక్ట్ గా ఎంట్రీలు ఇచ్చి.. సామాన్యులకు మాత్రం ఇలాంటి పిచ్చి టాస్కులు పెట్టి ఇబ్బంది పెడుతారా అంటూ తిట్టిపోస్తున్నారు. సామాన్యులకు ఎంట్రీ ఇవ్వాలంటే ఇన్ని రకాల ఇబ్బందులు పడాలా అని ఏకిపారేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ ను. జడ్జిలుగా ఉన్న నవదీప్, అభిజీత్, బిందు మాధవి కావాలనే పిచ్చి టాస్కులు ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. సామాన్యులపై ఇలాంటి చెత్త టాస్కులు ప్రయోగిస్తారా.. అదే బిగ్ బాస్ లో ఇలాంటి టాస్కులు సెలబ్రిటీలకు ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇంకొందరేమో.. అన్ని పిచ్చి టాస్కులు చేయడం అవసరమా.. ఆ బిగ్ బాస్ లోకి వెళ్లకపోతే ఏంటి అంటున్నారు. మొత్తానికి అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కాస్త వివాదంగా మారుతోంది.
Read Also : Sandeep Vanga : సందీప్ వంగాతో నాగ్ అశ్విన్ కు చిక్కులు.. ప్రభాస్ ఇప్పుడెలా..?
