NTV Telugu Site icon

Adi Reddy: బావుందయ్యా ఆది రెడ్డి.. నెలకి అరకోటి సంపాదిస్తున్నావ్!

Adireddy

Adireddy

Bigg Boss Adi Reddy Income Crosses 39 Lakhs in Youtube: యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ మంచి ఫేమస్ అయ్యాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఆదిరెడ్డి. బిగ్ బాస్ రివ్యూ చెబుతూనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ దక్కించుకున్న ఆయన సీజన్ సిక్స్ లో అందరినీ అలరిస్తూ సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి బిగ్ బాస్ కప్ గెలుచుకున్నాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఆయన చేసే యూట్యూబ్ రివ్యూ వీడియోలకు సైతం మంచి వ్యూస్ రావడం మొదలయ్యాయి. ఇక తాజాగా తనకు నెలకు 39 లక్షల రూపాయలు ఒక్క యూట్యూబ్ ద్వారానే వచ్చిందంటూ ఆదిరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశాడు. వాస్తవానికి ఆదిరెడ్డి ప్రతి సీజన్ కి రివ్యూస్ చెబుతూనే ఉన్నాడు.

Mrunal Thakur: మృణాల్‌తో డేటింగ్ న్యూస్.. పెదవి విప్పిన బాద్‌షా?

ప్రతి సీజన్లో పలువురు కంటెస్టెంట్ల అభిమానులు ఆదిరెడ్డి చెప్పిన రివ్యూలు నచ్చనప్పుడు అతను ఒక పెయిడ్ రివ్యూయర్ అని వారి దగ్గర డబ్బులు తీసుకుని తమ కంటెస్టెంట్ కి వ్యతిరేకంగా రివ్యూ చెబుతున్నాడని ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు, దానికి ఆది రెడ్డి ఖండిస్తూనే ఉంటాడు. ఇప్పుడు పెయిడ్ రివ్యూయర్ అంటూ వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ నెలకు 39 లక్షల రూపాయలు కేవలం యూట్యూబ్ ద్వారా తనకు వస్తున్నాయి కాబట్టి అసలు తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చారు. ఒక తెలుగు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ అనే వ్యక్తి తనకు నెలలో ఏకంగా మూడు కోట్ల రూపాయల రాబడి కేవలం యూట్యూబ్ ద్వారా వచ్చిందని ప్రకటిస్తే ఇప్పుడు ఆదిరెడ్డి తనకు 39 లక్షలు ఒక నెలలోనే వచ్చిందని ప్రకటించడం గమనార్హం.