Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 రెండు వారాలు కంప్లీట్ చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టింది. రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు. అంతకు ముందు శ్రష్టి వర్మ బయటకు వెళ్లింది. ఇక మూడో వారంకు సంబంధించిన నామినేషన్ల షూటింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. మూడో వారంలో ఇంటిలో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్లను నామినేట్ చేయాలని సూచించడంతో రచ్చ మొదలైంది. అయితే ఇక్కడే టెన్నెంట్స్ అందరూ కలిసి ఓనర్లలో నలుగురిని నామినేట్ చేయాలని చెప్పాడు. అలాగే ఓనర్లలో ఒకరిని ఓనర్లే నామినేట్ చేసుకోవచ్చని సూచించాడు.
Read Also : Bigg Boss : రీతూ చౌదరికి భారీ షాక్ ఇవ్వనున్న నాగార్జున..?
దీంతో అందరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ నామినేట్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వారంతా సడెన్ గా శత్రువులుగా మారిపోయారు. ఇంకేముంది రచ్చ బాగానే నడిచింది. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఊహించని కంటెస్టెంట్లు తెరమీదకు వచ్చారు. రాము రాథోడ్, రీతూ చౌదరీ, ప్రియా శెట్టి, హరిత హరీష్, కల్యాణ్, ఫ్లోరా షైనీ మొత్త ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం డిఫరెంట్ గా గేమ్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హౌస్ లో మరింత రచ్చ కోసం కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ వారం ఎవరు ఆకట్టుకుంటారు.. ఎవరు కెప్టెన్ అవుతారనేది చూడాలి.
Read Also : Thaman : వర్షమా బొక్కా.. తమన్ ఏంటీ కామెంట్లు
