Site icon NTV Telugu

Bigg Boss 9 : సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..?

Suman Shetty

Suman Shetty

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి ఒక కంటెస్టెంట్ మీదే అందరి దృష్టి ఉంది. ఆయనే సుమన్ శెట్టి. మొదటి వారం నుంచే ఆయన తన కామెడీ, ఇన్నోసెంట్, సింపుల్ నేచర్‌తో, నిజాయితీతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఫ్యాన్‌బేస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన ఆటకు, మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయనకు భారీగా ఓటింగ్ వస్తోంది. ఇక శనివారం బిగ్ బాస్ నుంచి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ‘శివ’ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా నాగార్జున, ఆ గెటప్‌లోనే స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. అలాగే అమల, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు.

Read Also : Rajinikanth : రజినీకాంత్ అన్నయ్యకు హార్ట్ ఎటాక్..

ఇక ఇప్పుడు విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున ప్రేక్షకులను హౌస్ లో ఉన్న వారి పేర్లు చెప్తా.. ఈ సీజన్ లో వాళ్లు హిట్టా , ఫ్లాపా అన్నది మీరే డిసైడ్ చేయాలి అని చెప్పారు. దాంతో ప్రేక్షకులు తమ ఓటింగ్ వేశారు. ఓటింగ్ ఫలితాల్లో, ప్రేక్షకుల ప్రేమ సుమన్ శెట్టికే భారీగా దక్కింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆయనకు సుమన్ శెట్టి హిట్టు అంటూ 100% హిట్ రేటింగ్ ఇచ్చారు ప్రేక్షకులు. ఆ తర్వాత స్థానాల్లో ఇమ్మాన్యుయేల్ – 95%, తనూజా – 93%, కళ్యాణ్ – 79%, రీతూ – 79%, డిమాన్ – 72%, గౌరవ్ – 69%, రాము – 59%, నిఖిల్ – 45%, సంజన – 43%, భరణి – 35% ఓట్లు సాధించారు. ఇలా చూస్తుంటే, సీజన్ మొత్తం సుమన్ శెట్టి డామినేట్ చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే కప్ కొట్టే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Anchor Suma : మేం విడిపోవాలని కోరుకున్నారు.. రాజీవ్ తో బంధంపై సుమ కామెంట్స్

Exit mobile version