Site icon NTV Telugu

Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి కీలక కంటెస్టెంట్ ఎలిమినేట్

Bigg Boss 9

Bigg Boss 9

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం రచ్చ రచ్చగా నడుస్తోంది. ఇప్పటికే మొదటి వారం శ్రష్టివర్మ ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో వారంకు సంబంధించి నామినేషన్స్ సోమవారం జరగ్గా.. మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. వారిలో భరణి, మాస్క్​మెన్ హరీష్, ఫ్లోరా షైనీ, మనీష్, ప్రియా, పవన్ ఉన్నారు. ఇక ఆదివారం ఇందులో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. మర్యాద మనీష్‌ ఎలిమినేట్ అయిపోయాడు.

Read Also : Mohan Lal : మోహన్ లాల్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు

ఆయన ఎలిమినేషన్ కు సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఈ వారం అత్యంత తక్కువ ఓటింగ్ వచ్చిన కంటెస్టెంట్ కూడా మర్యాద మనీష్ కావడంతో ఆయన్ను ఎలిమినేట్ చేశారు. పెద్దగా టాస్కులు ఆడకుండా.. నిత్యం అవతలి వారితో గొడవలు పెట్టుకుంటూ ఉండటం మనోడికి మైనస్ అయింది. గొడవలు పెట్టుకున్నా సరే నిజాయితీగా గేమ్ ఆడితే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. కానీ మర్యాద మనీష్ లో అదే మిస్ అయింది. అందుకే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు.

Read Also : Kanthara-1 : రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార-1 ట్రైలర్..

Exit mobile version