Site icon NTV Telugu

Bigg Boss 9 : బిగ్ బాస్-9 లో ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా..?

Bigg Boss 9

Bigg Boss 9

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9లో అప్పుడే రచ్చ మొదలైంది. ఒకరిపై ఒకరు రకరకాల నిందలు వేసుకుంటూ రచ్చ మొదలెట్టేశారు. ఈ సారి కామనర్స్ చేతిలో సర్వస్వం పెట్టేశాడు నాగార్జున. అలాగే సెలబ్రిటీలకు మాత్రం ఎలాంటి వసతులు లేని ఇంట్లో ఉంచుతూ.. వారితోనే అన్ని పనులు చేయిస్తున్నాడు. కాగా ఈ సీజన్ లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ అనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు ఎవరూ లేరు. అంతా టీవీ, సీరియల్ బ్యాచ్ వాళ్లే ఉన్నారు. పైగా ఓల్డ్ డేస్ నటులను తీసుకొచ్చారు. ఈ సారి అంతో ఇంతో జబర్దస్త్ కమెడియన్ అయిన ఇమ్మాన్యుయెల్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

Read Also : Little Hearts : ప్రేక్షకులు నిజంగా పిచ్చోళ్లే.. మౌళి షాకింగ్ కామెంట్స్

అతనికి వారానికి రూ.3.50000లు ఒప్పందం చేసుకుని తీసుకొచ్చారంట. ఆ తర్వాత స్థానంలో భరణి ఉన్నాడు. ఇతనికి రూ.3,20,000 వారానికి ఇస్తున్నారు. కామనర్స్ కు ఏమైనా ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇక సెలబ్రిటీల్లో అందరికంటే తక్కువ సుమన్ శెట్టికి ఇస్తున్నారు. అతనికి వారానికి రూ.75వేలు మాత్రమే ఇస్తున్నారంట. ఇందులో ఎవరు ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్ లో ఉంటే వారికి పెద్ద మొత్తంలో ముట్టే ఛాన్స్ ఉంటుంది. ఇపప్పటికే వారం గడిచిపోయింది. ఈ ఆదివారం మొదటి ఎలిమినేషన్ ఉండబోతోంది. కామనర్స్ కూడా బలమైన పోటీ ఇస్తున్నారు. మాటల్లో, ఆటల్లో వారు పైచేయి సాధించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

Read Also : Mouli Tanuj : మౌళికి బంగారం లాంటి అవకాశం.. కాపాడుకుంటే తిరుగులేదు..

Exit mobile version