NTV Telugu Site icon

Biggboss 7: బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి రెండు హౌస్ లు.. ?

Nag

Nag

Biggboss 7: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 6 సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్ చాలా ఆలస్యంగా వస్తుంది. ఇక ఈ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే ఈ సీజన్ నుంచి రిలీజైన ప్రోమోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసారి ఆరు సీజన్లకు మించి ఏడవ సీజన్ ఉండనుందని నాగ్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ తో ఉండనున్నదని తెలిపాడు. రివర్స్ లో ఈ గేమ్ ను కంటెస్టెంట్స్ ఆడనున్నారని చెప్పుకురావడంతో ఈ షోపై కొద్దిగా ఆసక్తిపెరిగింది. ఇక ఈ ఉల్టా పల్టా కాన్సెప్ట్ ఏంటి.. ? దానికి అర్ధం ఏంటి అనేది తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్ ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు. తెలుగులో ఎప్పుడు మొదలు పెడతారో.. తమిళ్ లో కూడా బిగ్ బాస్ అప్పుడే మొదలవుతుంది.

Uday Kiran: ఈ టాప్ సింగర్ ఉదయ్ కిరణ్ చెల్లి అని మీకు తెలుసా..?

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్.. బిగ్ బాస్ ఈసారి అంతకు మించి ఉండనుందని, ఈసారి ఒకటి కాదు రెండు హౌస్ లని కాన్సెప్ట్ లీక్ చేశాడు. అవును.. మీరు విన్నది నిజమే.. ఈసారి రేణు బిగ్ బాస్ హౌస్ లు ఉండనున్నాయట. ఒక హౌస్ లో కొంతమంది .. మరొక హౌస్ లో ఇంకొంతమంది కంటెస్టెంట్స్ ఉంచి .. వారి మధ్య పోటీలు, ఎలిమినేషన్స్ ఉండనున్నదని తెలుస్తోంది. అందుకే దీనికి ఉల్టా పల్టా అని పెట్టారని సమాచారం. కంటెస్టెంట్స్ విడివిడిగా ఉంచుతూ, అవసరమైనప్పుడు ఆ హౌస్ నుంచి ఈ హౌస్‌లోకి, ఈ హౌస్ నుంచి ఆ హౌస్ లోకి మారుస్తారని తేకూస్తోంది. ఇక ఇది విన్నాకా అభిమానులు ఇదేదో కొత్తగా ఉందే అని చెప్పుకొస్తున్నారు. సెప్టెంబర్ 3 న ఈ షో గ్రాండ్ గా లాంచ్ అవనుంది. మరి.. ఈసారి ఎవరు బిగ్ బాస్ విన్నర్ గా గెలుస్తారో చూడాలి.

Show comments