Site icon NTV Telugu

Arjun Ambati: ఆడబిడ్డకు జన్మినిచ్చిన బిగ్ బాస్ అర్జున్ భార్య..

Arjun

Arjun

Arjun Ambati: అగ్ని సాక్షి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ అంబటి. ఈ సీరియల్ తరువాత సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టాడు. తనదైన ఆటతో అందరి మనసులను గెలుచుకొని టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలాంటి పౌల్స్ లేకుండా గేమ్స్ ఆడి గెలిచిన ఏకైక హౌస్ మేట్ అంటే అర్జున్ అనే చెప్పాలి. ఇక గేమ్ పరంగా ఎంతో మంచిపేరు తెచ్చుకున్నా.. తన కన్నింగ్ నెస్ తో చాలాసార్లు ట్రోల్ కూడా అయ్యాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే అర్జున్ భార్య సురేఖ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తనతో ఉండకుండా బిగ్ బాస్ కు రావడం చాలా బాధగా అనిపిస్తుందని అర్జున్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.

ఇక ఫ్యామిలీస్ ను హౌస్ లోకి తీసుకొచ్చినప్పుడు.. కంటెస్టెంట్స్ అందరూ సురేఖకు సీమంతం కూడా చేశారు. అంతేకాకుండా నాగ్ అడిగినప్పుడు.. తనకు పాపనే పుడుతుంది అని.. ఆమె పేరు అర్కా అని కూడా పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక అదే నిజం అయ్యింది. ఈ విషయాన్నీ అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. సురేఖ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన పేరు అర్కా అని చెప్పుకొచ్చాడు. అర్జున్ లోనే మొదటి రెండు లెటర్స్.. సురేఖలోని చివరి రెండు లెటర్స్ వచ్చేలా పాపకు పేరు పెట్టినట్లు అర్జున్ తెలిపాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version