Site icon NTV Telugu

బిగ్ బాస్ లో షాకింగ్ ఘటన.. కత్తితో చేయి కోసుకొని నటి సూసైడ్..?

బిగ్ బాస్ రియాలిటీ షో.. ప్రతి భాషలోను అదరగొడుతుంది. కంటెస్టెంట్ల మధ్య గేమ్స్.. వారి భావోద్వేగాలను బయటపెడుతున్నాయి. తాజాగా ఒక కంటెస్టెంట్ టాస్క్ ఓడిపోయినందుకు కోపంతో ఊగిపోతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ ఘటన హిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో అఫ్సానా ఖాన్‌ అనే కంటెస్టెంట్ సూసైడ్ అట్టెంప్ట్ చేసింది. ఈ ఘటనతో షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్లు ఉలిక్కిపడ్డారు.

అసలు ఏం జరిగిందంటే.. హౌస్ కెప్టెన్ అయిన ఉమర్‌ రియాజ్‌.. తన దగ్గర ఉన్న పవర్స్ తో వీఐపీ టికెట్స్ ని ముగ్గురు కంటెస్టెంట్లకు ఇవ్వాల్సి ఉండగా అతను.. కరణ్‌ కుంద్రా, నిషాంత్‌ భట్‌, తేజస్వి ప్రకాశ్‌ ని ఎంచుకొని అఫ్సానా ఖాన్‌ ని రేస్ నుంచి తొలగించారు. దీంతో కోపంతో ఊగిపోయిన అఫ్సానా ఖాన్‌.. నమ్మిన స్నేహితులే తనను మోసం చేశారని ఏడుస్తూ ఇంట్లోని వస్తువులన్నీ పగలకొట్టి కత్తితో తనను తానూ గాయపరుచుకోవడానికి ట్రై చేసింది. ఇక ఏది గమనించిన మిగతా వారు ఆమెను గట్టిగా పట్టుకొని ఆ ప్రయత్నాన్ని విరమించేలా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అఫ్సానా ఖాన్‌ మొదటి నుంచి వివాదాలతోనే కనిపిస్తుంది.. ఆమె తీరు ఎవరికి నచ్చడం లేదని మాటలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

https://www.instagram.com/p/CWGLdaDj9rm/

Exit mobile version