Site icon NTV Telugu

బోల్డ్ బ్యూటీ తో డేట్ కి వెళ్తానన్న నాగ్ .. స్టేజిపైనే ముద్దులు

nagrjuna

nagrjuna

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి అంకానికి చేరుకొంది. ఈరోజుతో బిగ్ బాస్ ఫైనల్ కి చేరుకొంది. ఈ ఐదో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్‌ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ అతిరధ మహారథులు బిగ్ బాస్ స్టేజిపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మరుముఖ్యంగా బోల్డ్ బ్యూటీ సరయుతో నాగార్జున డేట్ కి వెళ్దాం అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. నాకు మీరంటే చాలా ఇష్టం .. నాతో డేట్ కి వస్తారా.. అని సరయు అడగగా సరేనంటూ తలూపిన నాగ్‌.. గ్రాండ్‌ ఫినాలే అయిపోగానే డేట్‌కి వెళ్దామని చెప్పడంతో సరయు ఆనందంగా ముద్దులు పెడుతూ గంతులేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

https://ntvtelugu.com/bigg-boss-telugu-season-5-grand-finale-promo/
Exit mobile version