బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణను వేరొక కోర్టుకు బదిలీ చేయాలన్న కంగన దరఖాస్తు తోసిపుచ్చింది. అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. జావేద్ అక్తర్ పరువునష్టం దావా కేసు విచారణ సందర్భంగా కంగన దరఖాస్తును అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు.అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా, వివేకంతో వ్యవహరించారని తెలిపారు. కంగనకు వ్యతిరేంగా ఎటువంటి పక్షపాతం ప్రదర్శించలేదన్నారు.
చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించినంత మాత్రాన కంగనకు వ్యతిరేకంగా ఉన్నట్లు కాదని చెప్పారు. ఈ తీర్పు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది.అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ..కంగనకు న్యాయమైన అవకాశాలు ఇచ్చిందన్నారు అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు కోరిన దరఖాస్తులన్నిటికీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఆదేశాలన్నిటినీ తాను పరిశీలించానన్నారు. అంధేరీ కోర్టు జారీ చేసిన ఆదేశాలను సెషన్స్ కోర్టు ధ్రువీకరించిందన్నారు. కేవలం సంశయం కారణంగా కేసును ఒక కోర్టు నుంచి వేరొక కోర్టుకు బదిలీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
కంగన దాఖలు చేసిన దరఖాస్తులో, తనకు అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుపై నమ్మకం పోయిందని తెలిపారు.
బెయిలు మంజూరు చేయదగిన నేరానికి సంబంధించిన కేసులో… కోర్టుకు హాజరుకాకపోతే తనకు వారంట్ జారీ చేస్తామని పరోక్షంగా ఈ కోర్టు బెదిరించిందని ఆరోపించారు. ఈ కోర్టు తనకు వ్యతిరేకంగా ఉందన్నారు కంగన గతేడాది ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగన చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించాయని ఆరోపించారు జావేద్ అక్తర్. బాలీవుడ్ కోటరీ అంటూ, తన పేరును అనవసరంగా ప్రస్తావించారని తెలిపారు. దీంతో అక్తర్‌పై కంగన కూడా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
