Pan India Films: సూపర్ స్టార్స్ ని అఖిల్ తట్టుకుంటాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాహుబలి 2 రిలీజ్ అయిన డేట్ కే తెలుగు నుంచి విడుదలవ్వనున్న పాన్ ఇండియా సినిమాగా ‘ఏజెంట్’ హిట్ కొడుతుందని సినీ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇదే డేట్ కి అఖిల్ కి పోటీ ఇస్తూ మరో పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ వార్ కి దిగుతుంది. మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్’ నుంచి పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఇటివలే పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. పోయ్యిన్యిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 500 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాక్ తో సంబంధం లేకుండా PS-1 అంత రాబట్టడంతో PS-2 మరింత ఎక్కువ కలెక్షన్స్ ని తీసుకోని వస్తుందని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కార్తి, విక్రమ్ లాంటి హీరోలు నటించడంతో తెలుగులో కూడా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకి మంచి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.
ఐశ్వర్య రాయ్ నటించడం, మణిరత్నం మూవీ అవ్వడంతో నార్త్ లో కూడా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకి సాలిడ్ మార్కెట్ అవుతుంది. ఈ కారణంగా అఖిల్ మూవీకి ఓపెనింగ్స్ విషయంలో కాస్త దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. తెలుగులో మాత్రం అఖిల్ ఎక్కువ కలెక్ట్ చేస్తాడు కానీ తమిళ్, హిందీ, ఓవర్సీస్ లాంటి ఏరియాల్లో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకే ఎక్కువ ఎడ్జ్ ఉంది. పైగా ఏప్రిల్ 28కి సరిగ్గా ఒక్క వారం ముందు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ఏప్రిల్ 21న రిలీజ్ రిలీజ్ కానున్న ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో టాక్ కూడా బాగుంటే సల్మాన్ సినిమా రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం. ఇలాంటి సమయంలో అఖిల్ ఏజెంట్ మూవీ రిలీజ్ అయినా నార్త్ వాళ్లు మన సినిమాని చూస్తారా అనేది ఆలోచించాల్సిన విషయమే. మరి సల్మాన్ ఖాన్, మణిరత్నం లాంటి బిగ్ నేమ్స్ ని దాటుకోని ఏజెంట్ సినిమాతో అఖిల్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి