NTV Telugu Site icon

Kollywood: కాస్త ఆగండి సర్… అందరికీ కావాలంటే అవ్వదిక్కడ

Kollywood

Kollywood

కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’. కార్తీ బర్త్ డే రోజున బయటకు వచ్చిన ‘జపాన్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజా మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దీపావళికి రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కార్తీ ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు కానీ మరో ఇద్దరు హీరోల ఫాన్స్ మాత్రం డైలమాలో ఉన్నారు. ట్రేడ్ వర్గాలది కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎందుకంటే దీపావళి ఫెస్టివల్ నే టార్గెట్ చేస్తూ కోలీవుడ్ లో యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’ కూడా రిలీజ్ అవుతోంది. సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జపాన్ లాగే అయలాన్ కూడా ఇతర భాషల్లో రిలీజ్ అవ్వనుంది.

ఇక కార్తీ, శివ కార్తికేయన్ మధ్యలో తన సినిమాని కూడా రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో, పాన్ ఇండియా మొత్తం మార్కెట్ క్రియేట్ చేసుకున్న ధనుష్. దీపావళిని టార్గెట్ చేస్తూ ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారి బడ్జట్ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ సాలిడ్ బజ్ ఉంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని ధనుష్ అగ్రెసివ్ గా ప్రమోట్ చెయ్యడం గ్యారెంటీ. నిజానికి కార్తీ, శివ కార్తికేయన్ కన్నా ముందే దీపావళికి తన సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ధనుష్ అనౌన్స్ చేసాడు. అయితే ఒక డేట్ కి లేదా ఒకే సీజన్ లో ఇద్దరు ముగ్గురు హీరోల సినిమాలకి సరిపడే థియేటర్స్ తెలుగులో ఉన్నాయి కానీ తమిళనాడులో ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయితేనే థియేటర్స్ అడ్జస్ట్ చెయ్యడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది మల్టీలాంగ్వేజ్ రిలీజ్ టార్గెట్ తో, భారీ బడ్జట్ ని పెట్టి చేసిన జపాన్, అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలకి థియేటర్స్ అడ్జస్ట్ చేయడమనేది అయ్యే పని కాదు. మరి వీరిలో ఎవరైనా వెనక్కి తగ్గి, లేదా ముందుకి వచ్చి ఈ క్లాష్ ని అవాయిడ్ చేస్తారా లేదా అనేది చూడాలి. కాదు లేదు మేము అందరం దీపావళికే వస్తాము అంటే ఓపెనింగ్స్ విషయంలో మూడు సినిమాలు భారీగా నష్టపోవాల్సి వస్తుంది.