Site icon NTV Telugu

ఆ హీరో నాకు నచ్చడు.. అందుకే యాక్సిడెంట్ అవ్వాలని కోరుకున్నా- అరియానా

ariyana

ariyana

వివాదాల దర్శకుడు వర్మను ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారింది అరియానా గ్లోరీ. ఇక స్టార్ డమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా ‘అనుభవించు రాజా’ చిత్రంలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది. ఈ సందర్భంగా ఆమె, హీరో రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. “రాజ్ తరుణ్ అంటే నాకస్సలు నచ్చదు.. అతను టీవీ లో కనిపించినా ఆ ఛానల్ మార్చేంతవరకు వదిలిపెట్టను.. ఒకసారి ఆయన కారులో వెళ్తుంటే.. ఆ కారుకు యాక్సిడెంట్ అయ్యి కాలో, చేయో విరగాలని కోరుకున్నాను.

ఈ కోపానికి కారణం లేకపోలేదు.. బిగ్ బాస్ కి వెళ్తూ ముందు నేను చివరిగా ఇంటర్వ్యూ చేసింది రాజ్ తరుణ్ నే.. ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ అన్నారు. కానీ మధ్యాహ్నం 1:30 .. 2:00 అవుతున్నా ఆయన మాత్రం రాలేదు.. అక్కడ మూడుగంటలు వెయిట్ చేశాను. తీరా బయటికి వచ్చి చుస్తే కారులో ఆయన వెళ్లిపోతున్నారు. ఇదేంటి అని అడిగితే సార్ కి డబ్బింగ్ కరెక్షన్ ఉంది. అందుకోసమే వెళుతున్నారని చెప్పారు. నాకు కోపం మాములుగా రాలేదు. లైఫ్ లో ఇంకెప్పుడు రాజ్ తరుణ్ ని ఇంటర్వ్యూ చేయకూడదని నిర్ణయించుకున్నాను. కానీ, నేను నా ఫస్టు మూవీనే ఆయనతో చేయవలసి వచ్చింది. విచిత్రంగా షూటింగ్ మొదలైన రెండు రోజుల్లోనే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం” అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version