NTV Telugu Site icon

Bhumika Chawla: వ్యాపారంలోకి అడుగు పెట్టిన భూమిక.. ఏంటో తెలుసా?

Bhumika Chawla

Bhumika Chawla

టాలివుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన జతకట్టింది.. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది..

ఒకప్పుడు బిజీగా ఉన్న ఈ అమ్మడు పెళ్లి చేసుకొని ఇంటికే పరిమితం అయ్యింది.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్‌తో మెప్పిస్తోంది. ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్‌కు అక్కగా నటించి మెప్పించింది. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తోన్న ఎమర్జన్సీ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.. సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈమె ఇప్పుడు కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..

ఇక ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. గోవాలో కొత్త హోటల్‌ను ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు… ఆమె తన భర్త కొడుకుతో కలిసి హోటల్ ను ప్రారంభిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే రెండు, మూడు ప్రాజెక్టు లకు సైన్ చేసిందని తెలుస్తుంది..