Site icon NTV Telugu

Bhumi Pednekar: 10 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసిన భూమి.. ఫ్యాషన్‌పై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Bhumi Pednekar

Bhumi Pednekar

బాలీవుడ్‌ తార భూమి పెడ్నేకర్ ఈ ఏడాది తన 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘భక్షక్‌’, ‘సోంచిరియా’, ‘బధాయి దో’ వంటి శక్తివంతమైన కథల చిత్రాలను ఎంచుకుని, ప్రేక్షకులకు గుర్తింపు పొందిన భూమి, ఆమె సినిమా ఎంపికలే తనలోని మార్పుకు కారణమని చెబుతుంది. బాల్యం, కెరీర్‌ మొదటి దశలను గుర్తు చేసుకుంటూ, యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ ‘దమ్‌ లగా కే హైసా’ ద్వారా ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది అని పేర్కొన్నారు. మొదట్లో అవకాశాల కోసం ఎదురు చూసినప్పటికీ, ఇప్పుడు కోరుకున్న లక్ష్యాలను సాధించారని, ప్రతి చిత్రం తన అభివృద్ధికి, నటిగా పెరుగుదలకు అవకాశం ఇచ్చిందని భూమి చెప్పారు.

Also Read : Deepika Padukone : ‘కల్కి-2’ వివాదంపై పరోక్షంగా స్పందించిన దీపికా పదుకొణె

తాజాగా ఫ్యాషన్‌పై వచ్చిన విమర్శలకు భూమి తేలికగా స్పందించారు.. ‘సినీ రంగంలోకి రావడం వల్ల జీవితంలో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. నా జీవితంలో చాలా జరిగాయి. నా కెరీర్‌ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ధైర్యంగా, సినిమాను దాటి మాట్లాడే అవకాశం దొరికింది. బిగినింగ్ లో నా వృత్తి కారణంగా కొన్ని నియమాలను చూపించేదాన్ని. ఇప్పుడు ఎందుకో నేను ఫ్యాషన్‌ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నా.. ‘‘ఆమె ఎందుకు అంత కష్టపడుతోంది. ఆమె చాలా మంచి నటి. ఫ్యాషన్‌ గురించి ఎందుకు ఆలోచిస్తోంది’’ అంటూ కొంత మంది సోషల్ మీడియాలో నాపై కామెంట్లు చేస్తున్నారు. కానీ నేను ఎందుకు ఫ్యాషన్‌ గురించి పట్టించుకోకూడదు? ఏం చేయాలో, చేయకూడదో అనేది నా వ్యక్తిగత నిర్ణయం. ఫ్యాషన్‌ అనేది నా ప్రతిభను ప్రపంచానికి చెప్పడానికి ఓ గొప్ప మార్గం’ అని తెలిపింది.

Exit mobile version