Site icon NTV Telugu

Siva Kandukuri: ‘భూతద్దం భాస్కర్ నారాయణ’కు అంత ధీమా ఏమిటీ?

Bb (1)

Bb (1)

Siva Kandukuri: మంచి చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ నటుడుగా చక్కని పేరు తెచ్చుకుంటున్నాడు శివ కందుకూరి. అతను హీరోగా, రాశి సింగ్ హీరోయిన్ గా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ఈ సినిమాతో పురుషోత్తం రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీనిని స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదైంది. అలానే మోషన్ పోస్టర్ తో సినిమా కాన్సెప్ట్ ను మేకర్స్ తెలియచేశారు. వీటికి చక్కని స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాను మార్చి 31న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ మూవీ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”మా ‘భూత‌ద్దం భాస్క‌ర్‌ నారాయ‌ణ’ ధియేట‌ర్ కి వ‌చ్చిన ప్ర‌తి ప్రేక్ష‌కులకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అనుభూతిని కలిగిస్తుంది. ఇందులోని ఏ స‌న్నివేశాన్ని ముందుగా ఊహించలేని విధంగా దర్శకుడు స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది” అని తెలిపారు.

ఇదిలాఉంటే… మార్చి 30వ తేదీ అంటే ఈ సినిమాకు ముందు రోజున పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, నాని ‘దసరా’ మూవీలు విడుదల కావాల్సి ఉంది. ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీలో మార్పు ఉండొచ్చేమో కానీ నాని ‘దసరా’ మాత్రం అదే తేదీకి వస్తుందని తెలుస్తోంది. ఆ రకంగా చూస్తే, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్ బరిలోకి దిగుబోతున్నాడనే అనుకోవాలి!

Exit mobile version