Siva Kandukuri: ‘భూతద్దం భాస్కర్ నారాయణ’గా యంగ్ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘చూసి చూడంగానే’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ. ఆ తర్వాత అతను చేసిన ‘గమనం’ చిత్రం వివిధ భాషల్లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా శివ కందుకూరి నటించిన మరో సినిమా ఫస్ట్ గ్లింప్స్ మంగళవారం విడుదలైంది. పురుషోత్తం రాజ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో శివ కందుకూరి సరసన రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో ఓపెన్ చేస్తే శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి వద్దకు నారద మునితో పాటు ఇంద్రుడు వచ్చి కలియుగంలో రాక్షసులు భువిపైకి అవతరించబోతున్నారు. అట్టి రాక్షసుల నుంచి కాపాడమని వేడుకొంటాడు. దానికి సాక్షాత్తు ఆ నారాయణుడు ‘చింతించకు ఇంద్రదేవా.. కలియుగంబున భువిపైన జనియించి, ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నాన’ని చెప్పడంతో హీరో శివ కందుకూరి భూతద్ధం భాస్కర్ నారాయణ రూపంలో ఎంట్రీ ఇస్తాడు. షర్టు వేసుకుని, లుంగీ కట్టుకుని, నల్ల కళ్లజోడు పెట్టుకుని, రివాల్వర్ తీసుకుంటాడు. పోలీస్ జీపు నుంచి దిగి స్టైల్‌గా సిగరెట్ అంటించి అందర్నీ ఆకట్టుకుంటాడు భూతద్ధం భాస్కర్ నారాయణ. ఈ గ్లింప్స్ ని చూస్తే ఇది ఒక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీలా అనిపించడమే కాదు, గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్ కథ అనేది అర్థమౌతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని త్వరలోనే మరిన్ని వివరాలు తెలియచేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. అరుణ్, దేవీప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్, కమల్, గురురాజ్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..