NTV Telugu Site icon

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. భోలే సంచలన వ్యాఖ్యలు

Pallavi

Pallavi

Pallavi Prashanth: ఈ ఏడాది జరిగిన సెన్సేషనల్ ఘటనలలో బిగ్ బాస్ సీజన్ 7 కు పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడం ఒకటి. అదే సెన్సేషన్ అనుకుంటే.. అతను బయటకు వచ్చి రచ్చ చేయడం, అరెస్ట్ అవ్వడం మరింత సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. రైతుబిడ్డగా హౌస్ లోపలికి వెళ్లి.. విన్నర్ గా బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేక అరెస్ట్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడంతో బయటకు వచ్చాడు. ఇక పల్లవి ప్రశాంత్ గురించి సింగర్ భోలే షావలీ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భోలే.. పల్లవి ప్రశాంత్ ఈ అరెస్ట్ వలన చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని, అసలు బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళానా అని ఏడ్చినట్లు తెలిపాడు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని చెప్పి షాక్ కు గురిచేశాడు.

” పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా బయటకు రాగానే అతడికి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. హీరోగా రైతుబిడ్డను పరిచయం చేయాలనీ అనుకున్నారు. చాలామంది వ్యాపారవేత్తలు లక్షల్లో గిఫ్ట్స్ పంపిస్తామని అన్నారు. రైతుబిడ్డ హీరోగా చేస్తే ఆ సినిమాకు నేనే సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు. కానీ, ఇంతలోనే ఆ అరెస్ట్, రచ్చ అంతా జరిగిపోయింది. ఈ ఘటనతో పల్లవి ప్రశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.. బిగ్ బాస్ కు వెళ్లకపోతే బావుండేది అన్న అంటూ చెప్పాడు. ఇక బెయిల్ నుంచి బయటకు వచ్చాకా.. అభిమానులు అతడి పై పెట్టుకున్న నమ్మకం చూసి చాలా సంతోషపడ్డాడు. త్వరలోనే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ముందుకు వస్తా” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.