Site icon NTV Telugu

Bholaa Shankar: ‘భోళా శంకర్’పై మీమ్స్ వేస్తే గల్లంతే.. ఎందుకో తెలుసా?

Bhola Shankar Competetion

Bhola Shankar Competetion

Bholaa Shankar Team Warns memers: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. ‘ఆచార్య’ చిత్రానికి మించిన డిజాస్టర్ గా ఆయన కెరీర్లో మచ్చలా నిలిచే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇక మీమర్లు అయితే ఈ సినిమాలోని సీన్లను మీమ్స్ గా రూపొందిస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే అసలే మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టుగా ట్రోలర్లు రెచ్చిపోతూ ఉండడంతో ఈ ట్రోలింగ్ ను తట్టుకోలేక సినిమా టెక్నికల్ టీం ఈ మీమ్స్ కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తోంది.

Seerat Kapoor: త్రివర్ణ రంగుల్లో మెరిసిన సీరత్ కపూర్

అందులో భాగంగానే మీమ్స్‌లో ఉపయోగిస్తున్న సినిమా క్లిప్స్, ఫోటోలకు కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం పంపుతూ అకౌంట్స్ బ్లాక్ చేయిస్తామని వార్నింగ్ ఇస్తోందట. అయితే ఈ నిర్ణయంపై మీమర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తునట్టు తెలుస్తోంది. కొన్ని ఈవెంట్లకు తమను ఆహ్వానించి ఇప్పుడు తమ మీద ఇలా చేయడం ఏమాత్రం బాలేదని అంటున్నారు.ఇక మరోపక్క ఆర్థికంగా నష్టపోయిన తమను చిరంజీవి ఆదుకోలేదని నిర్మాత అనిల్ సుంకర కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగగా అది నిజం కాదని సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘భోళాశంకర్’ను క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించగా, చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ ఆమె ప్రియుడి పాత్రలో సుశాంత్ కనిపించారు.

Exit mobile version